Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా

PM Modi hyderabad tour postpone
Advertisement
  • ఈ నెల 19న హైదరాబాద్ రావాల్సిన ప్రధాని
  • సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభించాల్సిన మోదీ
  • అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో సభకు ప్లాన్ చేసిన బీజేపీ
Advertisement
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉంది. హైదరాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. సికింద్రాబాద్- విజయవాడ మధ్య రైల్వే ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టాల్సి ఉంది. అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్లాన్ చేశారు. 

కానీ, ప్రధాని  షెడ్యూల్ లో మార్పుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తుంది. మోదీ రాకపోవడంతో ఈ పనులన్నీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, త్వరలోనే మోదీ తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Advertisement
Advertisement
Narendra Modi
Hyderabad
Telangana
tour
postpone

More Telugu News